GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 9:39 pm Posted by : GARUDA DHATRI NEWS

పిచ్చాటూరు బైపాస్‌లో టైరు పేలి లారీ దగ్ధం

గరుడధాత్రి :

పిచ్చాటూరు బైపాస్‌లో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ లారీ టైరు పేలిపోవడంతో మంటలు చెలరేగి లారీ దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉండగా టైరు పేలడంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం.
మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే లారీని రోడ్డుపక్కన నిలిపివేసి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఘటన అనంతరం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రమాద ప్రాంతం వద్ద వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. మంటల కారణంగా కొంతసేపు బైపాస్‌పై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని చక్కదిద్దారు.