GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 5:57 am Digital Edition : GURU SWAMY

పిచ్చాటూరు మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు

గ్రామ సభలో అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం

పిచ్చాటూరు సెప్టెంబర్ 04 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఓటర్ల జాబితాలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సదరు గుర్తింపుపై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే, సంబంధిత ఓటర్లు గ్రామ సభ జరిగే రోజున తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చని పేర్కొన్నారు.

ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, గుర్తించిన ఓటర్ల జాబితాను ఆయా గ్రామాలకు తీసుకువెళ్లి గ్రామపంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని పిచ్చాటూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, అలాగే ప్రింట్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రజల అభ్యంతరాలు, సూచనలకు అవకాశం కల్పించి పారదర్శకంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.