పిచ్చాటూరు మండలంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
పిచ్చాటూరు, జూన్ 21 గరుడధాత్రి: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పిచ్చాటూరు మండలంలోని వెంగళత్తూర్ జడ్పీ హైస్కూల్‌తో పాటుగా స్థానిక ప్రైవేట్ పాఠశాలల్లో ఆదివారం యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీ, ఎంఈఓ-2 యుగంధర్ రాజు పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. మండలంలోని అన్ని...