గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన ఒక దరఖాస్తు మాత్రమే అందింది. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు స్వీకరించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ, సీడీపీఓ సౌభాగ్యమ్మ, మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవరెడ్డి, ఎంఈఓ-2 యుగంధర్ రాజు తదితర మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.