GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:13 pm Digital Edition : GURU SWAMY

పిచ్చాటూరు రామగిరి దేవాలయంలో భారీ పోలీసు బందోబస్తు – ఎస్సై బి. రాఘవేంద్ర

పిచ్చాటూరు జూలై 05 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరి పంచాయతీలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వాలేశ్వర స్వామి దేవాలయాల్లో ఆడికృత్తిక ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుపతి డీఎస్పీ రవికుమార్, సీఐ రవీంద్ర ఆదేశాల మేరకు సుమారు 80 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర తెలిపారు.
దేవాలయానికి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి ఆలయానికి వచ్చే వారిపై, అలాగే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భక్తులు పోలీసు అధికారులకు సహకరించి, క్రమశిక్షణతో దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎస్సై బి. రాఘవేంద్ర విజ్ఞప్తి చేశారు.