*పిచ్చాటూరు లో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే ఆదిమూలం*
మండల కేంద్రమైన పిచ్చాటూరు లో ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డు ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభోత్సవం చేశారు.
ఉదయం 10 గంటలకు పిచ్చాటూరు లోని టూటౌన్ కు చేరుకున్న ఎమ్మెల్యే నూతన సీసీ రోడ్డు ను సాంప్రదాయ బద్దంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హాయంలో పల్లెలు, పట్టణాల్లోని వీధులకు మోక్షం కలిగిందన్నారు.
భారీగా సిమెంట్ కాంక్రీట్ రోడ్లను నిర్మాణం చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిమూలం స్పష్టం చేశారు.
అలాగే అన్నదాతలకు రైతు ఎన్టీఆర్ రైతు భరోసా, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు వంటి పథకాలతో ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే వివరించారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వినాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించడానికి బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో అన్నీ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏ ఎం సీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.