పిజిఆర్ఎస్ సేవలపై పై క్యూ.ఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయండి- జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
గడురదాత్రి న్యూస్ కడప, జూలై 26 : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర అభిప్రాయ సేకరణ చేసి ప్రజల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడం, వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతుందన్నారు. పిజిఆర్ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల...