పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి
అకాల వర్షాలకు పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిద్ధార్థ గ్రామ శివారులో గొర్రెల మేపడానికి వెళ్లిన సందర్భంలో మధ్యాహ్న పిడుగుపాటుకు మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి జనార్ధన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు . ప్రకృతి విపత్తులకు బలి అయ్యే గొర్రెల కాపరులకు ప్రభుత్వం సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు...