GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 7:24 am Posted by : GURU SWAMY

పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించండి

తల్లిదండ్రులు ప్రతి ఒకరు వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని స్థానిక మండల విద్యాశాఖ అధికారి 2 ఉష కోరారు.బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని మదనంబెడు గ్రామంలో ఆమె ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి విద్యా ఆవశ్యకతను వివరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ టు ఉష మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించడం, డ్రాప్ అవుట్సు అయిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం,నాణ్యమైన విద్య అందించడం వంటి లక్ష్యంతోనే బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పిల్లలను గుర్తించి ప్రభుత్వ బడుల్లో చేర్పించడం వల్ల ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 26 మంది పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడం జరిగిందన్నారు.తదనంతరం పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులతో విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించి ప్రభుత్వ బరుడలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించడంతోపాటు దీనిపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ నేపథ్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమం పై ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కనిపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నిండ్ర విక్రమ్,ఖాదర్ వేడు,పాఠశాల ఉపాధ్యాయులు లోకేష్,సిఆర్ఎంటి రామారావు తదితరులు పాల్గొన్నారు.