పీఎం-వీబీఆర్‌వై కింద శ్రీసిటీలో నూతన ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ
గరుడధాత్రి : కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) పథకం కింద శ్రీసిటీలోని ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పై పథకం కింద ఎంపికైన నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) సి.రమేష్ కుమార్, ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్ డా. దివ్య బ్రహ్మం, తిరుపతి ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్-2 సతీష్ కుమార్, డిప్యూటీ లేబర్...