‘పులిగోరు’ చే టీడీపీ సీనియర్ కార్యకర్తలకు సన్మానం..
తిరుపతి, మే 28 గరుడధాత్రి న్యూస్ : తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటాలను బహూకరించారు. మహానాడు రెండవ రోజు అయినా గురువారం టిడిపి కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, తిరుపతి కోపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన...