పూతలపట్టులో డీఎస్సీ పై వైసీపీ ర్యాలీ- పోలీసులపై దూసుకెళ్లిన వైసిపినాయకులు

పూతలపట్టు ఆగస్టు 10 (గరుడ రాత్రి న్యూస్) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు డీఎస్సీ పై గత మూడు రోజులుగా వైసిపి ప్రజా ప్రతినిధులు నిరాహార దీక్షలు చేపట్టారు. సోమవారం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ర్యాలీలు నిర్వహించాలని పార్టీ ఆదేశించడంతో పూతలపట్టు మండల కేంద్రంలో రాష్ట్ర మేధావుల సంఘం కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.వెంకటేశ్వర కళ్యాణ్ మండపం...