GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 7:58 am Posted by : GARUDA DHATRI NEWS

పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించండి.. సిపిఎం

కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి &జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి జనార్ధన్ ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటిస్తూ, మరోపక్క పేద ప్రజలపై భారాలు మోపుతూ ప్రజల నిత్యావసర ధరలపై ప్రభావం చూపేలాగా పెట్రోలు డీజిల్, గ్యాస్ రైతులు పై ప్రభావం చూపే లాగా ఎరువుల పైన ధరలు పెంచి కంపెనీలకు లాభాలు చేకూర్చే పనులు మోడీ ప్రభుత్వం ఉన్నదని జనార్దన్ విమర్శించారు. తక్షణమే ధరల పెంపుపై రాష్ట్రంలోని కూటమి పార్టీలు ప్రతిపక్షంలోని వైయస్సార్సీపీ పార్టీ స్పందించాలని లేకుంటే ప్రజలు వచ్చే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.