GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 4:23 pm Posted by : GARUDA DHATRI NEWS

పెట్రోల్,డీజిల్,గ్యాస్,ధరలు తగ్గించాలి -సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో.

పిచ్చాటూరు జూన్ 9 రుడధాత్రి :
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ఎన్ డి ఏ ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు మేరకు
ఆటో యూనియన్ ఇతర ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి సుభాష్ , ఏ.ఐ.టి.యు. సి. నియోజకవర్గ అధ్యక్షులు అన్నాదొరై మాట్లాడుతూ…
దేశంలో , రాష్ట్రంలో , కార్పొరేట్ , కోటీశ్వరులకు కొమ్ముగాస్తు పెట్రోల్ , డీజిల్ ,గ్యాస్ ,ధరలను పెంచి ప్రజలందరికీ మోయలేని భారాన్ని మోడీ ,చంద్రబాబు , రుద్దుతున్నారని. ఇది చాలా దుర్మార్గమైన చర్యలు అని..
ఇరాన్ ,అమెరికా , యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ ఈ మోయలేని భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఆర్మూజ్ జలసందెలో ఏ రోజు ఇరాన్ భారత్ కోస్తున్న కురుడాయలు గాని సహజ గ్యాస్ గాని అడ్డుకోలేదని అయినా యుద్ధం సాగు చూపుతున్నారని ఇది ప్రజల్ని తీవ్రంగా మోసగించడమేనని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు..
మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్ ,డీజిల్ ,పది రూపాయలకు తక్కువ చేసే అమ్ముతుంటే చంద్రబాబు నాయుడు పన్నులు పెంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై భారం పెంచారని ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు అన్నాదొరై ఆరోపించారు..
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విజయ్, ముని చంద్ర, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకరన్, అయ్యప్ప, హరి, సురేష్, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.