GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 8:38 am Digital Edition : GURU SWAMY

పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డి ఆర్,పిఆర్‌ సి బకాయిలు చెల్లించండి – రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గురు రాజారావు విజ్ఞప్తి

పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) :

రాష్ట్రంలో వున్న 13 లక్షలమంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 25 వేలకోట్ల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షులు గురు రాజారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు‌.ఏపి జేఏసీ అమరావతి దాని అనుబంధ సంఘాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సంయుక్తగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం కార్యాచరణలో భాగంగా గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహారానికి పూలమాలవేసి, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పక్షాన విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట అసోసియేట్ అధ్యక్షులు గురు రాజారావు మాట్లాడుతూ…. గత 7 సంవత్సరాలుగా పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న డిఆర్ అరియర్స్ జనవరి 2019 నుండి 2023 డిసెంబర్ ( ఏడు విడతలు), ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు చెల్లించవలసిన పిఆర్సీబకాయిలు,‌ప్రభుత్వం నేటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ పథకానికి ప్రతి నెలా ఎన్ జి ఓ లు రూ.225, గెజిటెడ్ ఆఫీసర్స్ రూ.300 మరియు పెన్షనర్లు గత 12సం” లుగా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నా ప్రభుత్వం గుర్తింపు పొందిన కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యం సక్రమంగా అందడం లేదని,ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదన్నారు. జూలై 2023 నుండి 12 వేతన కమిటీని ఏర్పాటు చేయాలి కానీ నేటికీ ఏర్పాటు చేయలేదు.కమిటి ఏర్పాటు చేసి తాత్కాలిక భృతి చెల్లించాలని కోరుతున్నాం. 2024 నుండి చెల్లించవలసిన ఐదు విడతల కరువు భత్యం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఇంత ఆలస్యానికి కారణం ఉద్యోగుల జేఏసీలు. ఇకనైన మీరు ప్రభుత్వంతో ఐకమత్యంతో చర్చలు జరిపి 13 లక్షలమంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెననర్ల జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం నందు ఆ సంఘ నాయకులు విశేషం సంఖ్యలో పాల్గొన్నారు.