పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డి ఆర్,పిఆర్ సి బకాయిలు చెల్లించండి – రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గురు రాజారావు విజ్ఞప్తి
పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) : రాష్ట్రంలో వున్న 13 లక్షలమంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 25 వేలకోట్ల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షులు గురు రాజారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఏపి జేఏసీ అమరావతి దాని అనుబంధ సంఘాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సంయుక్తగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం కార్యాచరణలో భాగంగా గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహారానికి పూలమాలవేసి, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్...