తిరుపతి జులై 1 గరుడధాత్రి :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణారెడ్డి చేతుల మీదుగా వృద్ధులు, వితంతువులకు పంపిణీ చేశారు. బుధవారం తిరుపతి నగరంలోని మూడవ క్లస్టర్ లో ఉన్న 26,27,32 వార్డులలో ఉన్న అర్హులైన వికలాంగులు వృద్ధులు వితంతువులు లకు 4000 రూపాయల చొప్పున పెన్షన్లను పులిగోరు మురళి కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన చెప్పారు. త్వరలో వేలాది మంది అర్హులైన వారికి కూడా పెన్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో 26వ వార్డు అధ్యక్షులు గంజి సుధాకర్ రెడ్డి, 27 అధ్యక్షులు నాగప్రసాద్, 32 అధ్యక్షులు దేవాచారి, 27వ యూనిట్ ఇన్చార్జి చింతా భరణి యాదవ్, 26వ వార్డు జనసేన అధ్యక్షులు మోహన్, సూర్యనారాయణ రెడ్డి విజయ్ శంకర్, బబ్లు పాల్గొన్నారు.