పెన్షన్‌ కోసం పొలాల బాట పట్టాల్సిందేనా?

నీర్పాకోటలో లబ్ధిదారుల అవస్థలు.. సర్వేయర్‌ తీరుపై తీవ్ర ఆరోపణలు “ఇంటి వద్దకే పెన్షన్‌ అందేది.. ఇప్పుడు గుడి, బడి దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది” అంటూ లబ్ధిదారుల ఆవేదన సత్యవేడు అక్టోబర్ 02 గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని నీర్పాకోట పంచాయతీలో పెన్షన్‌ పంపిణీ తీరుపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెలంతా ఎదురుచూసే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ కోసం వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. చివరకు పెన్షన్‌ తీసుకునేందుకు పొలాల బాట పట్టాల్సిన...