GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:42 pm Digital Edition : GURU SWAMY

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

-వెంకటగిరి నియోజకవర్గంలో రూ. 23 లక్షల 99 వేల 123 రూపాయలు సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ ​చేసిన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ

వెంకటగిరి ఆగస్టు 16 గరుడధాత్రి

వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి పట్టణం మరియు ఆరు మండలాలకు చెందిన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

మొత్తం 47 మందికి గాను రూ. 23 లక్షల, 99 వేల 123 రూపాయలు విలువైన చెక్కులను వివిధ మండలాల, పట్టణ లబ్ధిదారులుకు ఆయన అందజేశారు.

పట్టణ మరియు మండలాల వారీగా పంపిణీ చేసిన చెక్కుల వివరాలు:

కలువాయి మండలం:

13 మందికి రూ. 5,93,108/-

రాపూరు మండలం:

3 మందికి రూ. 88,198/-

సైదాపురం మండలం:

2 మందికి రూ. 2,82,275/-

బాలాయపల్లి మండలం:

6 మందికి గాను రూ. 2,51,953/-

డక్కిలి మండలం:

7 మందికి రూ. 3,09,281/-

వెంకటగిరి (టౌన్):

9 మందికి రూ. 6,40,774/-

వెంకటగిరి (రూరల్):

4 మందికి రూ. 2,33,563/-

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు కనీస వైద్య సాయం అందలేదని, కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నేడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషితో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు
ప్రతి ఒకటవ తేదీనే ఉదయం 7 గంటలకల్లా వృద్ధులకు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వారి ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఆయన కొనియాడారు. కేవలం వెంకటగిరి నియోజకవర్గంలోనే వేలాది మందికి సకాలంలో పెన్షన్లు అందుతున్నాయన్నారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి సన్న బియ్యంతో కూడిన నాణ్యమైన భోజనం, పాలు, గుడ్డు, చిక్కీలు మెనూ ప్రకారం క్రమం తప్పకుండా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
రాబోయే 2047 నాటికి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని, అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్, డక్కిలి, రూరల్ మండల అధ్యక్షులు, రూరల్ మండల సీనియర్ నాయకులు, అన్ని మండల కూటమి నేతలు , కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు