పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

*ఎమ్మెల్యే అమర్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చేతుల మీదుగా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రూ. 1.25 కోట్ల అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ (IPHL) ల్యాబరేటరీ ప్రారంభం పలమనేరు, సెప్టెంబర్ 12 (గరుడ ధాత్రి ) : పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పలమనేరు ఏరియా ఆసుపత్రిలో...