GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:15 am Digital Edition : GURU SWAMY

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కార్వేటి నగరం ఆగస్టు 11 గరుడ దాత్రి న్యూస్
పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చంగల్రా యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా అన్నారు. కార్వేటినగరం మండలం కేశవకు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ గారి ఆదేశాల మేరకు కేశవ కుప్పం పంచాయతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల రాజు , నాయకులు లక్ష్మణ్ రాజు , బూత్ కన్వీనర్లు శ్రీనివాసులు మురళి రాజు పంచాయతీ జనరల్ సెక్రెటరీ వెంకట రామయ్య, పంచాయతీ ఉపాధ్యక్షులు కేశవులు టిడిపి కార్యకర్తలు వెంకట ముని, తమ్మిరెడ్డి, నాగమందడి, నర్సమందుడి, నడిపిమందడి, గోపిరెడ్డి, గోవిందమందడి, నారమందడి, హరిబాబు, రవి, వాసు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.