పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామానికి చెందిన పేరయ్య (55) మృతిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం కీలపూడి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పేరయ్య భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎమ్మెల్యేతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ ఇళంగోవన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాల పద్మనాభం యాదవ్, గజేంద్ర, ఢిల్లీ బాబు తదితరులు హాజరై పేరయ్య భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పేరయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని స్థానికులు పేర్కొన్నారు.