GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:30 am Digital Edition : GURU SWAMY

పొన్నమండ విశిష్ట సేవలను స్మరించుకుందాం

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
కుప్పం,ఆగస్టు 007(గరుడ ధాత్రి న్యూస్):అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యునిగా, అగ్నికుల క్షత్రియ సమాజానికి గుర్తింపు, గౌరవం సాధించేందుకు వర్మ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.ఆయన ఆశయాలు, స్ఫూర్తిని కొనసాగించేందుకు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు లక్ష్మణ స్వామి సమాజానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ జయంతి నివాళులు.