పోరాటరాలతోని వ్యవసాయ కార్మికుల సమస్య పరిష్కారం అవుతాయని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పుల్లయ్య తెలిపారు. శనివారం సత్యవేడు స్థానిక బేరి శెట్టి కళ్యాణ మండపంలో వ్యవసాయ కార్మిక సంఘ తిరుపతి జిల్లా పదో మహాసభలు వ్యాకాశ ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ మహాసభలను వ్యాకాస రాష్ట్ర కమిటీ సభ్యులు గురవమ్మ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏపీ వ్యకాస రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య పాల్గొనగా, జిల్లా అధ్యక్షుడు టి బాలకృష్ణ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యాకాశ రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో వ్యవసాయ కార్మికులు కూలీల పాత్ర కీలకమన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయడానికి ప్రయత్నం చేస్తుందని,అందులో భాగంగా రెండు పూటలా పని విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఉపాధి పని ప్రదేశాల్లో టెంట్లు మంచినీళ్లు మజ్జిగ పనిముట్లతో పాటు అత్యవసర ఆరోగ్య కిట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల సాగు భూములకు డి పట్టాలు ఇవ్వాలన్నారు. గిరిజనులకు,దళితులకు ప్రభుత్వ మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. నిరుపేద వ్యవసాయ కార్మికులు కూలీల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.అత్యవసరమైతే 2013 భూ సేకరణ చట్ట ప్రకారం భూ సేకరణ చేపట్టాలన్నారు. భూములు కోల్పోయిన రైతులకు, ఈ భూములపై ఆధారపడి పని చేస్తున్న వ్యవసాయ కూలీ కుటుంబాలకు పునరావాస ప్యాకేజీలు అమలు పరచాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలని గత కొన్ని సంవత్సరాలుగా నిరసన తెలియజేస్తున్న సత్యవేడు రైతులకు వ్యవసాయ కార్మిక సంఘం తమ పూర్తి మద్దతును తెలియజేస్తున్నట్లు ఈ సభలలో పేర్కొన్నారు. రైతుల అంగీకారం మేరకు ఇప్పుడున్న భూ విలువలకు సమానంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్ భూమిలేని వ్యవసాయ కార్మికులకు మూడు ఎకరాలు భూమి ఇవ్వాలని. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని.మహిళలు బాలికలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు నివారించి భద్రత కల్పించాలని.మద్యం మత్తు నుండి ప్రజలను కాపాడాలని.దళిత,గిరిజన,మైనార్టీలపై జరిగే దాడులను అరికట్టాలని పాత ఉపాధి పథకాన్ని కొనసాగించాలని.సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలనేటువంటి పలు ప్రజా సమస్యలపై ఈ సభలో తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి పోరాట ప్రణాళికలు రూపొందించారు. తదనంతరం బెడిశెట్టి కళ్యాణమండపం నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ గుండా గోడ గడియారం కూడలి వద్దకు చేరుకొని నిరసనను ముగించారు. ఈ కార్యక్రమంలో వ్యాకాస జిల్లా ఆఫీస్ బేరర్స్,రాజగోపాల్,రమణయ్య కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్ కే బి పురం మండల సిఐటియు కార్యదర్శి నాగరాజు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణాచలం, సత్యవేడు మండల కార్యదర్శి కృష్ణయ్య, నాగలాపురం మండల కార్యదర్శి మురుగేష్, గ్రీన్ అంబాసిడర్ కార్మిక సంఘ కార్యదర్శి మునస్వామి డప్పు కళాకారుల సంఘ అధ్యక్షులు అరుణ్ మరియు పలు ప్రజా సంఘ నాయకులు,వ్యవసాయ కార్మికులు,కూలీలు పాల్గొన్నారు.