GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:21 am Digital Edition : GURU SWAMY

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబరు 31

2026 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి, కడపనత్తం, గౌనితిమ్మేపల్లి, పాతపేట, పాతూరునత్తం పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి వెంకట్రాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ శనివారం పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల్లో తగిన వెలుతురు, తాగునీరు, పారిశుద్ధ్యం, దివ్యాంగులు–వృద్ధుల కోసం ర్యాంపులు, తదితర మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారు. ఓటర్లు క్రమబద్ధంగా క్యూలో నిలిచేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ఈ పర్యటనలో పీడీఓలు సుబ్రమణ్యం, రూపాదేవి తదితరులు పాల్గొన్నారు.