పోలింగ్ కేంద్రాల నిర్వహణపై సమీక్షా సమావేశం
పిచ్చాటూరు, ఆగస్టు 22 గరుడధాత్రి : త్వరలో జరగనున్న పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండలంలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 21 పంచాయతీలు, 180 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 21న...