పోలీస్ బందోబస్తుతో స్వామి వారి వాహన సేవ
నాగలాపురం వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ముత్యాల పందిరి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. మాడవీధులలో స్వామివారిని ఊరేగించగా, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. గ్రామోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై సునీల్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.వాహన సేవ మార్గమంతా భద్రతా ఏర్పాట్లు చేపట్టి, భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించారు.ఈఏర్పాట్ల వల్ల కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగింది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని ఆనందభరితులయ్యారు.