GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 7:03 am Digital Edition : GURU SWAMY

పోలేరమ్మ ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

*గాజులతో అమ్మవారి ఆలయానికి ప్రత్యేక అలంకరణ భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ

*గరుడ ధాత్రి నాయుడుపేట ఆగస్టు 21*
నాయుడుపేట పట్టణంలోని గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ నానబాల సుబ్బారావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని వేలాది గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఎండోమెంట్‌ ఈవో నవీన్‌కుమార్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ నానబాల సుబ్బారావు, కమిటీ సభ్యులు నిత్య కృష్ణారెడ్డి, ఆబోతుల బాబు, హైమావతి, వినుకొండ ధనుంజయ, బాలుశెట్టి, కంచర్ల సురేష్‌, పి. మురళి తదితరులు పాల్గొన్నారు.