పోలేరమ్మ ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం
*గాజులతో అమ్మవారి ఆలయానికి ప్రత్యేక అలంకరణ భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ *గరుడ ధాత్రి నాయుడుపేట ఆగస్టు 21* నాయుడుపేట పట్టణంలోని గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని వేలాది గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు...