కార్వేటి నగరం సెప్టెంబర్ 28 (గరుడతాద్రి న్యూస్): కార్వేటి నగరం మండలంలోని డిఎం పురం సచివాలయ పరిధిలో గల సురేంద్ర నగరం అంగన్వాడి పాఠశాలలో సిడిపిఓ శోభారాణి, సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అంగనవాడి ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఖరీదైన పండ్లు కాయల లోనే పోషకాలు ఉంటాయని అనుకోకుండా మన స్థానికంగా పరిసర ప్రాంతాల్లో లభించే కాయలు, పండ్లు, పాలు, ఆకుకూరలు వంటివి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని ,రాగులు పేదవాని ఆహారంగా భావించకుండా గర్భవతులు, బిడ్డతల్లులు తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెల్లగా పాలిష్ చేయబడిన బియ్యం, ఉప్పు, చక్కెర ఈ మూడు రకాల తెలుపు వస్తువులను వాడకాన్ని తగ్గించడం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ కు పోషకాలు అంది వయసుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో
సూపర్వైజర్ రోజా రమణి, బిజెపి మహిళ మోక్ష కార్యదర్శి గిరిజ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ భారతి, దివ్యభారతి, అంగన్వాడి ఉద్యోగులు :- వరలక్ష్మి, అమరావతి, శాంతి, విజయ,సుధారాణి,లత ఆశా వర్కర్లు:- అశ్విని, లీల గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.