పోషక ఆహార అలవాట్లు పై అవగాహన: సిడిపివో శోభారాణి

కార్వేటి నగరం సెప్టెంబర్ 28 (గరుడతాద్రి న్యూస్): కార్వేటి నగరం మండలంలోని డిఎం పురం సచివాలయ పరిధిలో గల సురేంద్ర నగరం అంగన్వాడి పాఠశాలలో సిడిపిఓ శోభారాణి, సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అంగనవాడి ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఖరీదైన పండ్లు కాయల లోనే పోషకాలు ఉంటాయని అనుకోకుండా మన స్థానికంగా పరిసర ప్రాంతాల్లో లభించే కాయలు, పండ్లు, పాలు, ఆకుకూరలు వంటివి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని ,రాగులు పేదవాని ఆహారంగా భావించకుండా...