ప్రచార ఆర్భాటాలు చాలూ…! ప్రజా సమస్యలపై దృష్టి పెట్టేదెప్పొడో …?
సత్యవేడు నియోజకవర్గంలో పేరుకుపోతున్న సమస్యలు - పరిష్కారాల కోసం ప్రజల ఎదురుచూపులు గరుడధాత్రి : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నప్పటికీ, సత్యవేడు నియోజకవర్గంలో ఏళ్ళతరబడి పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రజా సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రచార ఆర్భాటాలు, రాజకీయ కార్యక్రమాలకు పరిమితమవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానిక ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న డిమాండ్ ప్రజల వద్ధనుండి వినిపిస్తోంది. -ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేది ఎప్పుడు? తమిళనాడు సరిహద్దులో ఉన్న సత్యవేడు...