ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

బైరెడ్డిపల్లి, గరుడదాత్రి అక్టోబరు 28 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార వాహనాలకు పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందాలని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు, తహసిల్దార్ ప్రసన్న కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనాల నంబర్లు, ప్రచారం నిర్వహించే ప్రాంతాలు, వినియోగించే తేదీల వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి పొందిన అనంతరమే వాహనాలను వినియోగించాలని, అసలు అనుమతి పత్రాన్ని వాహనం ముందు అద్దంపై స్పష్టంగా...