ప్రజలతో ఉండండి, చేసిన అభివృద్ధిని చెప్పండి – ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
పనిచేసే వారికి గుర్తింపు, అవకాశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం విజయం సాధించాలి ---ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు సెప్టెంబర్ 23 (గరుడ రాత్రి న్యూస్)పార్టీ అధికారంలో ఉంటేనే మనకుగుర్తింపుఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల సన్నద్ధతా సమావేశం బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. జిల్లా...