ప్రజల మన్ననలు పొందిన కానిస్టేబుల్ భూపతికి బదిలీ
గరుడధాత్రి : నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భూపతి సత్యవేడు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయినట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాల పాటు సేవలందించిన అనంతరం సాధారణ బదిలీపై ఆయన సత్యవేడుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారశైలితో భూపతి ప్రత్యేక గుర్తింపు పొందారు. నాగలాపురం మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ప్రతి ఒక్కరికీ సమానంగా న్యాయం అందేలా...