ప్రజల సహకారంతోనే ఆపరేషన్‌ త్రిశూల్‌ విజయవంతం …పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర

పిచ్చాటూరు గరుడధాత్రి న్యూస్ : డ్రగ్స్‌, మత్తు పదార్థాలు, మత్తు రసాయనాలకు అడ్డుకట్ట వేయడం, మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించడం, రోడ్డు ప్రమాదాల నివారణే ఆపరేషన్‌ త్రిశూల్‌ ప్రధాన లక్ష్యమని పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర తెలిపారు. ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపరేషన్‌ త్రిశూల్‌ లక్ష్యాలను సాధించడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని...