ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ మూల స్తంభం – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది అత్యంత విలువైన స్తంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా వెలిబుచ్చే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని అన్నారు. సమాజంలోని అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించే పాత్రికేయుల సేవలు అపారమని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే వారధిగా పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోందని...