GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:52 pm Posted by : GARUDA DHATRI NEWS

ప్రజా పరిష్కార వేదికలో..11 ఫిర్యాదులు

– ఫిర్యాదుదారులకు సమస్యల పరిష్కారం జరుగుతుంది
– తహసీల్దార్ చంద్రబాబు నాయుడు,
ఎంపీడీవో మహమ్మద్ రఫీ

పిచ్చాటూరు మే 25 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
రెవెన్యూ శాఖకు సంబంధించి 9 అర్జీలు, మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి 1 అర్జీ, మండల విద్యాశాఖకు 1 అర్జీ వచ్చినట్లు వెల్లడించారు. ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి, కేటాయించిన గడువులో సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చంద్రబాబు నాయుడు మరియు ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.