ప్రజా భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలి – పలమనేరు పరిరక్షణ సమితి
పలమనేరు, సెప్టెంబర్ 28 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలమనేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆదివారం మున్సిపల్ కమిషనర్, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు వినతిపత్రాలు అందజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, సర్కిళ్లు, స్పీడ్ బ్రేకర్లు, వంతెనల వద్ద తెల్లరంగు, రోడ్డు భద్రతా సూచికలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సబ్...