GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 5:59 am Digital Edition : GURU SWAMY

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ పాలన.

ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కూటమి నాయకులు

చిత్తూరు అక్టోబర్ 8(గరుడ దాత్రి న్యూస్) ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలన సాగుతోందని, 25 ఏళ్లుగా ప్రజాసేవలో అధికారంలో కొనసాగడం మోడీ క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకిత భావాన్ని తెలియజేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా పాలన పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమంలో భాగంగా గురువారం చిత్తూరులో “సేవా జ్యోతి యాత్ర” ద్విచక్ర వాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ.. కూటమి నాయకులతో కలిసి ప్రధానమంత్రి ఫోటోతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ సర్కిల్, గిరింపేట, కాజూరు సర్కిల్, దర్గా సర్కిల్, ఎంజీఆర్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం మహాత్మా గాంధీ, ఎన్టీఆర్, జ్యోతిబా పూలే విగ్రహాలకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగడం సామాన్య విషయం కాదన్నారు. ప్రజల నమ్మకం, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం కారణంగానేముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కొనసాగుతున్నట్లు చెప్పారు. మోడీ నాయకత్వంలో భారత్ విశ్వ గురువుగా మారిందని, ప్రపంచంలో భారత్ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు. దేశ పురోభివృద్ధి కోసంఅనేకసాహసోపేతమైన నిర్ణయాలు,సంస్కరణలో తీసుకున్నారన్నారు. ప్రజా పాలనలో సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, నరగ తెదేపా అధ్యక్షుడు వరుణ్ కుమార్, కూటమి నాయకులు సీకే లావణ్య, అట్లూరి శ్రీనివాసులు, యశ్వంత్, వెంకటేష్ యాదవ్, ఈశ్వర రావు, అనురాధ, క్లస్టర్, డివిజన్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.