ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ పాలన.
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కూటమి నాయకులు చిత్తూరు అక్టోబర్ 8(గరుడ దాత్రి న్యూస్) ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలన సాగుతోందని, 25 ఏళ్లుగా ప్రజాసేవలో అధికారంలో కొనసాగడం మోడీ క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకిత భావాన్ని తెలియజేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా పాలన పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న "సేవా సంకల్ప అభియాన్" కార్యక్రమంలో భాగంగా గురువారం చిత్తూరులో "సేవా జ్యోతి యాత్ర" ద్విచక్ర...