ప్రజా సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో నాలుగు అర్జీలు
పిచ్చాటూరు ఆగస్టు 17 గరుడధాత్రి : పిచ్చాటూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నాలుగు అర్జీలను అధికారులు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల...