GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:36 pm Digital Edition : GURU SWAMY

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 15 వినతులు స్వీకరణ

పలమనేరు,ఆగస్టు 03 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పురపాలక కమిషనర్ లోకేశ్వర వర్మ ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ….నేడు నిర్వహించిన పీజీఆర్ఎస్ వేదికలో వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 15 వినతులు వచ్చినట్లు తెలిపారు. శాఖల వారీగా వచ్చిన వినతుల వివరాలు: ఇంజనీరింగ్ విభాగం: 09, టౌన్ ప్లానింగ్ విభాగం: 04, ప్రజారోగ్య విభాగం: 01, రెవిన్యూ విభాగం: 01. ప్రజల నుండి అందిన ఈ ఫిర్యాదులన్నింటినీ ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువులోగా వేగవంతంగా పరిష్కరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. పురపాలక సంఘం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ సురేష్, టీపీవో ఇందిర, ఆర్ఐ, ఏఈలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.