GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 1:42 pm Digital Edition : GURU SWAMY

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారుల గైర్హాజరు

11.45 గంటలు దాటినా కార్యాలయానికి రాని అధికారులు

నిరీక్షణలో ప్రజలు.. ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంత నిర్లక్ష్యమా?

సూళ్లూరుపేట గరుడధాత్రి :

📌 ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి సత్వర పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రశ్నార్థకంగా మారింది.

📌 నిర్ణీత సమయానికి ప్రజలు వినతిపత్రాలతో కార్యాలయానికి చేరుకుని అధికారుల కోసం ఎదురు చూసినా, ఉదయం 11.45 గంటలు దాటినా సంబంధిత అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆశతో వచ్చిన ప్రజలు కార్యాలయ ప్రాంగణంలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

📌 రైతులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూమి వివాదాలు, పట్టాదారు పాస్‌బుక్లు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై వినతులు అందించేందుకు వచ్చినప్పటికీ, అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.