ప్రతి ఇంటిలో బిన్- బ్యాగ్… ప్రతి గ్రామంలో పరిశుభ్రతే లక్ష్యం
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29 ప్రభుత్వ ఆదేశాలు సహాయ కమిషనర్ (పంచాయతీ రాజ్) ఇచ్చిన మార్గదర్శకాల మేరకు బైరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో "బిన్ – బ్యాగ్" కార్యక్రమంపై గురువారం అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎం.పి.డి.ఓ.ఆనంద భాబు మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ఆరోగ్యవంతంగా మార్చేందుకు ప్రతి కుటుంబం తప్పనిసరిగా బిన్ – బ్యాగ్ విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిలో తడి చెత్తను ఒక డబ్బాలో, పొడి చెత్తను ఒక బ్యాగ్‌లో వేర్వేరుగా నిల్వ చేసి గ్రామపంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు....