ప్రతి పీహెచ్‌సీలో 100% పరిశుభ్రత, మెరుగైన వైద్య సేవలు ఉండాలి : డీఎంహెచ్‌వో డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి

పలమనేరు, సెప్టెంబర్ 12 ( గరుడ ధాత్రి ) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి శనివారం పలమనేరు డివిజన్ పరిధిలోని గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సదుపాయాలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డాక్టర్లు ప్రజలు మెచ్చుకునేలా నిరంతరం నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. దీని ద్వారా పీహెచ్‌సీపై ప్రజల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ పర్సెప్షన్) పెరిగి, ఆసుపత్రి గ్రేడింగ్ మెరుగుపడుతుందన్నారు....