ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్‌లో భాగంగా ప్రత్యేక ఎక్స్‌రే శిబిరం
పిచ్చాటూరు, జూన్ 16 గరుడధాత్రి: ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక టీబీ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే యంత్రం ద్వారా ఛాతీ ఎక్స్‌రేలు తీశారు. మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారు, మధుమేహం బాధితులు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, టీబీ రోగులతో సన్నిహిత సంబంధం ఉన్న కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షలు నిర్వహించారు. తీసిన ఎక్స్‌రేలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా...