GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:14 am Digital Edition : GURU SWAMY

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు లో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి

చిత్తూరు ఆగస్టు,7(గరుడ దాత్రి న్యూస)
ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి హక్కులు, భూములు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (World Day of Indigenous Peoples) సందర్భంగా శుక్రవారం (07-08-2026) గుడిపాల మండలం కనకనేరు ఎస్.టి. కాలనీ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎం.ఎస్. భారతి పాల్గొన్నారు. ఆదివాసీల హక్కులు, అటవీ హక్కుల చట్టం (Forest Rights Act), పోక్సో చట్టం (POCSO Act), బాల్య వివాహాల నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం (Right to Education Act), మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన చట్టాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండకముందు వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.చిన్నారులపై లైంగిక వేధింపులు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన పోక్సో చట్టం గురించి వివరిస్తూ, పిల్లల భద్రతకు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను పొందే హక్కు ఉందని, ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండేలా పిల్లలను తీర్చిదిద్దాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈఈ (హౌసింగ్) పి. సిద్ధార్థ్, పంచాయతీరాజ్ శాఖ ఏఓ/ఎంపీడీఓ కె. వేణు, డిప్యూటీ తహసీల్దార్ కె.జె. వెంకటరమణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఆర్. శివప్రసాద్, ఎస్‌.ఐ. కె. రామమోహన్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పీడీ ఐసీడీఎస్ డి. వెంకటేశ్వరి ప్రభుత్వ అధికారులు, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కనకనేరు ఎస్.టి. కాలనీ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు