ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు లో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి
చిత్తూరు ఆగస్టు,7(గరుడ దాత్రి న్యూస) ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి హక్కులు, భూములు, జీవన విధానాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (World Day of Indigenous Peoples) సందర్భంగా శుక్రవారం (07-08-2026) గుడిపాల మండలం కనకనేరు ఎస్.టి. కాలనీ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...