ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ
పిచ్చాటూరు, ఆగస్టు 1 గరుడధాత్రి : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు ప్రాజెక్ట్ పరిధిలోని రాజానగరం అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు కల్పలత, సుమతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హెల్త్ సూపర్వైజర్లు వెంకటలక్ష్మి, రాజారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు కల్పలత, సుమతి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు తొలి టీకా వంటివని, వాటి...